Telangana : నేడు చివరి విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం
తెలంగాణలో చివరి విడత పంచాయతీ నేడు ఎన్నికలు ప్రారంభమయ్యాయి
తెలంగాణలో చివరి విడత పంచాయతీ నేడు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.మధ్యాహ్నం రెండు గంటలకు సర్పంచ్, వార్డు సర్పంచ్ పదవులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం వైస్ సర్పంచ్ ఎన్నికలు కూడా జరపనున్నారు.
సున్నిత ప్రాంతాల్లో...
నేడు చివర విడతగా తెలంగాణలోని 3,753 సర్పంచ్, 28,410 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలోనూ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడతలో మొత్తం 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు నేటి తెలంగాణలో ముగియనున్నాయి. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.