Kishan Reddy : లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం
ప్రధానితో తెలంగాణ బీజేపీ పార్లమెంటు సభ్యుల భేటీపై వచ్చిన లీకులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రధానితో తెలంగాణ బీజేపీ పార్లమెంటు సభ్యుల భేటీపై వచ్చిన లీకులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో చర్చించిన విషయాలు లీకులు చేసిన వ్యక్తులు పిచ్చోళ్లు అని కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవల ప్రధానితో బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. అయితే ఈ సందర్బంగా ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు వార్తలొచ్చాయి.
ప్రధాని తో జరిగిన భేటీలో...
ప్రధానితో జరిగిన భేటీ అంశాలను బయటకు చెప్పొద్దని ప్రధాని చెప్పినా లీక్ చేశారని కిషన్‌రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని సూచించారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పారన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో పార్టీ బలోపేతంపైనే ఇక దృష్టి పెడతామని కిషన్ రెడ్డి చెప్పారు. లీకు వీరులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.