Telangana : తెలంగాణలో నేడు కాంగ్రెస్ నిరసనలు
తెలంగాణలో నేడు కాంగ్రెస్ నిరనసనలు తెలియజేయనుంది
తెలంగాణలో నేడు కాంగ్రెస్ నిరనసనలు తెలియజేయనుంది. జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు తెులంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలను తెలియజేయను్నాయి. మహాత్మా గాంధీ చిత్రపటాలతో డీసీసీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు తెలపనున్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ...
జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని, గాంధీ పేరును తొలగించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని కాంగెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.