కవిత ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ రియక్షన్.. విచారణకు ఆదేశం

తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం రియాక్ట్ అయింది

Update: 2025-12-16 06:12 GMT

తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఐడీపీఎల్ భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. భూ కబ్జాలపై ఇటీవల కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. చెరువు భూములను కూడా ఆక్రమించారని కవిత ఆరోపించారు. అదే సమయంలోకవిత భర్తపైన కూడా మాధవరం కృష్ణారావు భూ కబ్జా ఆరోపణలు చేశారు.

సర్వే నెంబరు 376 లో...
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఐడీపీఎల్ భూములపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. కూకట్ పల్లి సర్వే నెంబరు 376 లో ఏం జరిగిందో విచారించి నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News