కూతురేమో సర్పంచి తండ్రి ఉప సర్పంచి

జనగామ మండలం వెంకిర్యాల గ్రామ ఉప సర్పంచి, సర్పంచిలుగా తండ్రీ కూతురు బాధ్యతలు చేపట్టారు.

Update: 2025-12-16 14:46 GMT

జనగామ మండలం వెంకిర్యాల గ్రామ ఉప సర్పంచి, సర్పంచిలుగా తండ్రీ కూతురు బాధ్యతలు చేపట్టారు. సర్పంచిగా కుమార్తె గొల్లపల్లి అలేఖ్య, తండ్రి గొల్లపల్లి పర్శయ్య ఎన్నికయ్యారు. అలేఖ్యకు అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. భర్త ప్రోద్బలంతో ఆమె సర్పంచి బరిలో నిలిచింది. ఎన్నికల్లో ఆమె గెలుపొందింది. గ్రామంలో 10 వార్డులు ఉండగా.. 8 వార్డులు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. అందులో పర్శయ్య కూడా ఉన్నారు. పర్శయ్యతో పాటు మరో అభ్యర్థి ఉపసర్పంచి పదవికి పోటీ పడ్డారు. తండ్రి పర్శయ్యకు అలేఖ్య మద్దతు పలకడంతో ఉపసర్పంచిగా ఆయన ఎన్నికయ్యారు.

Tags:    

Similar News