సైకిళ్ళపై తిరుగుతున్న పోలీసులు.. వంగర పోలీసులకు ప్రశంసలు
పోలీసులు రయ్యు.. రయ్యిమంటూ కార్లలోనూ, బైక్ లలోనూ తిరుగుతారనుకుంటే పొరపాటే.
పోలీసులు రయ్యు.. రయ్యిమంటూ కార్లలోనూ, బైక్ లలోనూ తిరుగుతారనుకుంటే పొరపాటే. ఇక్కడి పోలీసులు సైకిళ్ళపై వీధుల్లో తిరుగుతూ ఉంటారు. తెలిసిన వాళ్లను పలకరిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ వాకబు చేస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎంచక్కా చెబుతారు.
వరంగల్ జిల్లా వంగరలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఎస్సై దివ్య తన సిబ్బందితో కలిసి సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 గ్రామాల్లో వంగర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైకిళ్లపై తమ గ్రామాలకు వచ్చిన పోలీసులను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్సై దివ్య సొంతంగా 50వేలు రూపాయలు పెట్టి సిబ్బంది కోసం కొత్త సైకిళ్లు కొనుగోలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీసులు ప్రజ మధ్యే ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు క్రిమినల్స్ జంకుతారని దివ్య తెలిపారు.