Telangana : చేవెళ్ల లో జరిగిన బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్

తెలంగాణలోని చేవెళ్ల లో జరిగిన బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది

Update: 2025-12-24 06:44 GMT

తెలంగాణలోని చేవెళ్ల లో జరిగిన బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. కంకర లోడుతో ఉన్న టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ బస్సు ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మరణించగా అందులో ప్రయాణిస్తున్న టిప్పర్ యజమాని లచ్చు నాయక్ గాయపడ్డారు.

టిప్పర్ యజమాని...
అయితే ఈ ప్రమాదానికి అతి వేగం, ఓవర్ లోడ్ కారణమని పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. రాంగ్ రూట్ లో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారరు. లచ్చునాయక్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయనపై పోలీసుల కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.


Tags:    

Similar News