కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది

Update: 2025-12-24 07:46 GMT

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. సినీనటుడు నాగార్జున కుటుంబంపై పరువు నష్టం కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున తన కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. అయితే తర్వాత నాగార్జున దానిని ఉప సంహరించుకున్నారు. కానీ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం ఈ కేసు విచారణలోకి తీసుకుంది.

వ్యక్తిగతంగా హాజరు కావాలని...
జనవరి 12వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే నెల 12వ తేదీన ప్రజాప్రతినిధుల కోర్టుకు ఈ కేసులో కొండా సురేఖ హాజరు కావాల్సి ఉంది. కొండా సురేఖకు సమన్లు జారీ చేయడంతో మరొకసారి ఈ కేసు విచారణలోకి వచ్చినట్లయింది. ప్రజాప్రతినిధుల కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది.


Tags:    

Similar News