Telangana : అంతా ఆ పెన్ డ్రైవ్ లోనే ఉందట

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2025-12-24 04:54 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు తన డేటా అంతటా పెన్ డ్రైవ్ లో ఉంచారని సిట్ అధికారులు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్ లో ఆరు వేల మందికి సంబంధించిన డేటా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది ఆనుపానులు పసిగట్టిన ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్ లో సమాచారాన్ని మొత్తాన్ని ఉంచినట్లు పోలీసులు కనుగొన్నారు.

ఎల్లుండితో ముగియనున్న...
ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై ప్రభాకర్ రావును నేడు కూడా సిట్ అధికారులు విచారించనున్నారు. ఎల్లుండితో ప్రభాకర్ రావు విచారణ గడువు ముగియనుంది. దీంతో ఈరోజు, రేపు, ఎల్లుండి ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలను రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెన్ డ్రైవ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారంగా మారనుందని చెబుతున్నారు.


Tags:    

Similar News