Telangana : ఐపీఎస్ లకు పదోన్నతి

తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌లకు డీఐజీగా పదోన్నతులు లభించాయి

Update: 2025-12-24 04:46 GMT

తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌లకు డీఐజీగా పదోన్నతులు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీఐజీ హోదాలో పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు విడుదల చేశారు. ప్రమోషన్ పొందిన అధికారులందరూ 2012 బ్యాచ్‌కు చెందినవారే కావడం విశేషం.

కొత్త ఏడాది ప్రారంభం నుంచి...
వీరిలో శ్వేత, భాస్కరన్, చందన దీప్తి, శింగెనవర్, విజయ్ కుమార్, రోహిణి ఉన్నారు.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ఆరుగురు ఐపీఎస్ అధికారులు 2026 జనవరి 1 నుంచి డీఐజీలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనుభవం కలిగిన అధికారులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా పరిపాలనా సామర్థ్యం మరింత మెరుగుపడనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News