Telangana : నేడు గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ
నేడు గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
నేడు గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. గ్రూప్ వన్ పిటీషన్లపై నేడు ఇరువర్గాల వాదనలను హైకోర్టు ధర్మాసనం విననుంది. ఇప్పటికే ముగిసిన టీజీపీఎస్సీతో పాటు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల వాదనలు వినింది. గ్రూప్ 1 అభ్యర్థులు వేసిన పిటీషన్ పై విచారిస్తున్న ధర్మాసనం ఈ పరీక్షలు జరిగిన తీరుపై వాదనలను పరిశీలించనుంద.ి
ప్రతివాదుల తరుపున...
ఈరోజు కొనసాగనున్న ప్రతివాదుల తరపున వాదనలు కొనసాగనున్నాయి. మూల్యాంకనం సక్రమంగా జరగలేదని పిటీషనర్లు పేర్కొన్నారు. సింగిల్ బెంచ్ తీర్పుతో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై నేడు కూడా వాదోపవాదనలు సాగనున్నాయి.