Breaking : డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక నిర్ణయం
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ నియామక ఉత్తర్వులను రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్యానల్ లిస్ట్ ను యూపీఎస్సీకి పంపాలని హైకోర్టు అభిప్రాయపడింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్ట్ ను యూపీఎస్సీకి పంపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యూపీఎస్సీకి ప్యానెల్ లిస్ట్...
యూపీఎస్సీకి ప్యానెల్ లిస్ట్ ను పంపిన తర్వాత కౌంటర్ ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా జాబితాను పంపాలని కోరింది. అలాగే డీజీపీ నియామకం రద్దుకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.