Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

Update: 2025-12-25 04:15 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కాగజ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ జాకీర్ కుటుంబం వైద్యం కోసం నాగపూర్ కు వెళ్లారు.

కారు బోల్తాపడటంతో...
చికిత్స ముగించుకుని తిరిగి వస్తుండగా దేవాడ సమీపంలోని వంతెన వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. అదుపు తప్పి వంతెన పై కిందకు పడిపోవడంతో అందులో ఉన్న నలుగురు మరణించారు. మృతులను సహార,ఆఫ్జా బేగం, శబ్రీమ్, సల్మా బేగంలు మరణించారని పోలసీులు తెలిపారు. నలుగురు మహిళలు మరణించగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో మరొక ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News