Telangana : నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవల బంద్

తెలంగాణలో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది

Update: 2025-09-16 03:23 GMT

తెలంగాణలో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తమకు బకాయీలున్న పథ్నాలుగు వందల కోట్ల రూపాయలను వెటనే చెల్లించాలని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం కోరుతుంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆరోగ్య శ్రీ సేవలను నేటి నుంచి బంద్ చేయాలని నిర్ణయించాయి.

చర్చలు విఫలం కావడంతో...
ప్రయివేటు ఆసుపత్రుల యాజామాన్యం ఆరోగ్య శ్రీ బకాయీలపై గత ఇరవై రోజులుగా చర్చలు జరుపుతుంది. అయితే చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని ప్రయివేటు యాజమాన్యం నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 33 ఆసుపత్రులకు ఏడాదిగా బకాయీలు పెండింగ్ లో ఉన్నాయని అసోసియేషన్ చెబుతుంది.


Tags:    

Similar News