Kalvakuntal Kavitha : కవిత రిమాండ్ పొడిగింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను మరోసారి పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.

Update: 2024-05-07 12:19 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను మరోసారి పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మే 14వ తేదీ వరకూ కవిత జ్యడిషియల్ కస్టడీని పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. ఈరోజు కవితను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా ఆమె రిమాండ్ ను పొడిగిస్తూ తీర్పు చె్పింది. గత మార్చి నెల 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తీహార్ జైలులోనే...
కల్వకుంట్ల కవితను తిరిగి అధికారులు తీహార్ జైలుకు తీసుకెళ్లారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్నారు. అయితే నిన్న సీీబీఐ, ఈడీ చేసిన అరెస్ట్ లపై కవిత వేసిన పిటీషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి నిరణయం తీసుకున్నారు. తిరిగి కవితను మే 14వ తేదీన కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News