తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 29 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు.

Update: 2022-04-09 02:08 GMT

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 29 కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,91,329 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,86,753 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

యాక్టివ్ కేసులు..
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 249 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,111 మంది కరోనా కారణంగా మరణించారు.


Tags:    

Similar News