Breaking : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించిన అన్ని విషాయాలను రాబట్టేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఈ సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
దుబాయ్ లింకులను...
డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? ఈ పార్టీలో పాల్గొనేందుకు వచ్చిన వ్యాపారుల వెనక కథ ఏంటి? దుబాయ్ లింకులతో పాటు అనేక విషయాలను రాబట్టేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ వినియోగంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదికను అందించనుంది.