Telangana : భూదాన్ భూములపై హైకోర్టు సంచలన తీర్పు

భూదాన్ భూములపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది

Update: 2026-03-18 11:37 GMT

భూదాన్ భూములపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉన్న పేదలకు ఊరట దక్కింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు చెప్పింది. అక్కడ ఇళ్లు కోల్పోయిన వారిందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అందరికీ ఇళ్లు...
భూదాన్ భూముల్లో ఉన్నారంటూ ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లను ప్రభుత్వం కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బాధితులు తమకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు అందరికీ ఇంటి స్థలంతో పాటు ఇంటిని మంజూరు చేయాలని ఆదేశించింది. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్లకు ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూధాన్ భూములపై యధాస్థితి కొనసాగించాలని ఆదేశించింది.


Tags:    

Similar News