డ్రగ్స్‌ పార్టీ కేసులో మరో కీలక పరిణామం

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2026-03-18 05:39 GMT

తెలంగాణలోని మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై కేసు నమోదైంది. ఈ డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ మహేష్ సహా మెుత్తం 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

ముగ్గురిపై హత్యాయత్నం కేసు...
ప్రస్తుతం మహేష్ బెయిల్‌పై బయట ఉండగా.. ఫాంహౌస్‌లో కాల్పులకు పాల్పడినందుకు రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరొకవైపు సిట్ ఈ కేసులో దర్యాప్తును వేగం చేసింది. దుబాయ్ వ్యవహారాలను కూడా ఈ విచారణలో చేపట్టనుంది.


Tags:    

Similar News