కాంగ్రెస్ పాలనలో పరిహాస నామ సంవత్సరమే : కేటీఆర్
రెండున్నరేళ్ల పాలనలో మిగిలింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రెండున్నరేళ్ల పాలనలో మిగిలింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యావాదాలు చెప్పే తీర్మానంపై కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. ఉగాదులు వస్తున్నాయని,పోతున్నాయని కానీ ఈ ఏడాది మాత్రం పరాభవనామ సంవత్సరమయినా... ప్రజల చెంత పరిహాస నామ సంవత్సరమని కేటీఆర్ అన్నారు. కూలగొట్టు.. పడగొట్టు..విడగొట్టు అనే నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కేటీఆర్ అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి చేసిన మొదటి సంతకం ఏమయిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని కేటీఆర్ అన్నారు.
గ్యారంటీ కార్డులు ఏమయ్యాయని...
గ్యారంటీ కార్డులు ఏమయ్యాయని నిలదీశారు. టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలిచిందని, 420 కప్ పెడితే వీళ్లే గెలుస్తారని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కర్ణుడేనని, తర్వాత కుంభకర్ణుడేనని అన్నారు. భవిష్యత్ లో సరిదిద్దు కునే పరిస్థితి కూడా లేదని కేటీఆర్ అన్నారు. వరంగల్, కామారెడ్డి, చేవెళ్ల డిక్లరేషన్లు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. పదే పదే ఢిల్లీ యాత్రలు తప్పించి రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కనికట్టు ప్రకటనలు ఇచ్చి బయట రాష్ట్రాల వారిని కూడా బురిడి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. అట్టర్ ప్లాప్ సినిమాకు సంబురాలు ఎవరైనా చేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.