Telangana : ఈ నెల 20న కేబినెట్ భేటీ
ఈ నెల 20వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది
ఈ నెల 20వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉదయం 9.30 గంటలకు మంత్రివర్గం భేటీ జరగనుంది. పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
బడ్జెట్ కు ఆమోదం..
తెలంగాణ 2026 -27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. సమీక్షకు సంబంధించిన ఎజెండాను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు మరికొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే సమీక్ష అనంతరం కీలక నిర్ణయాలు కేబినెట్ తీసుకోనుంది.