Telangana : రైతులకు గుడ్ న్యూస్... ఒకేసారి అందరికీ నగదు జమ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.

Update: 2026-03-18 06:25 GMT

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతులకు ఒకే సారి రైతు భరోసా నిధులను జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకేసారి అందరికీ నగదు జమ చేస్తే ఎటువంటి ఆరోపణలు రావని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే నిధులను బట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఎకరం ఉన్న రైతులకు...
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను ఈ సారి కొత్త విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్నది. మొదటి విడతలో ప్రతి రైతుకూ ఒక ఎకరం వరకు నిధులు జమచేయనుందని సమాచారం. ఎకరానికి ఆరువేల రూపాయలు జమ చేయనున్నారు. దీని ద్వారా ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతుకూ లబ్ధి చేకూరనుంది. మిగతా భూమికి తర్వాత విడతల్లో జమ చేయనుంది. గతంలో ఎకరం భూమి ఉన్న రైతులతో మొదలుపెట్టి.. విడతల వారీగా పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేసేవారు. అయితే దీని వల్ల సాయం అందడంలో చాలా మందికి ఆలస్యమయ్యేది. దీని నుంచి అధిగమించేందుకు అందరికీ ఒకేసారి నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.


Tags:    

Similar News