Kavitha : మా పోరాటమే వెలుగుమట్ల బాధితులకు పట్టాలు

తమ పోరాటంతోనే రేవంత్ సర్కార్ దిగివచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు

Update: 2026-03-18 05:32 GMT

తమ పోరాటంతోనే రేవంత్ సర్కార్ దిగివచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఘటనపై రేవంత్ సర్కార్ స్పందించి కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

వెలుగుమట్ల బాధితులకు...
'ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 750 మంది పేదల ఇండ్లను కూలగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంయుక్త పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది. ఇండ్లు కోల్పోయిన వారిలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది'. అందరికీ న్యాయం జరిగేందుకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కవిత స్పష్టం చేశారు.


Tags:    

Similar News