Telangana : నేడు రైతులకు 'ఫార్మర్ కిట్స్' పంపిణీ : మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఫార్మర్స్ కిట్స్ పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఫార్మర్స్ కిట్స్ పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం కింద 'ఫార్మర్ కిట్స్' పంపిణీని నేడు ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు.
రైతులకు లబ్ది...
ఈ కార్యక్రమం ద్వారా 489 క్లస్టర్లలోని 61,125 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి కిట్ లో క్లాత్ బ్యాగ్, ఫీల్డ్ గైడ్, ఐడీ కార్డ్, క్యాలెండర్, టోపీ, డైరీ వంటి వస్తువులను అందజేస్తారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.