KTR : నేడు వరంగల్ జిల్లాకు కేటీఆర్
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లాకు వెళ్లనున్నారు
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లాకు వెళ్లనున్నారు. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తికి వెళ్లనున్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించనున్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే సభకు లక్షలాది మంది హాజరు కానుండటంతో వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
బహిరంగ సభ ఏర్పాట్లను...
ప్లీనరీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఏ జిల్లాలకు చెందిన కార్యకర్తలు ఎక్కడ కూర్చోవాలన్న దానిపై నేతలకు స్పష్టం చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని, అలాగే సభకు వచ్చే కార్యకర్తలు, నేతలకు భోజనం, మంచినీటి సదుపాయ కల్పనలపై కూడా కేటీఆర్ నేతలతో చర్చించనున్నారు. అనంతరం అక్కడే మీడియాతో కూడా కేటీఆర్ మాట్లాడతారు.