KTR : కాంగ్రెస్ ను నమ్మితే ఏముందో అర్థమయిందిగా?
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల వల్ల తెలంగాణకు ఒరిగే ప్రయోజనం ఏదీ ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల వల్ల తెలంగాణకు ఒరిగే ప్రయోజనం ఏదీ ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్ ప్రభుత్వం పునాదులతో సహా పెకిలించి వేస్తుందని అన్నారు. జీఎస్టీ వృద్ధి రేటు గుండు సున్నాగా మారిందన్న కేటీఆర్ ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ ప్రజలకు మిగిలేది గుండుసున్నా అని కేటీఆర్ అన్నారు.
గుండుసున్నాయే...
జీఎస్డీపీ, తలసరి వృద్ధిరేటులో తెలంగాణ అట్టడుగున నిలిచిందన్న కేటీార్ తెలివిలేని దద్దమ్మను గద్దెనెక్కిస్తే ఇలాగే ఉంటుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆగం చేయడమే కాకుండా కోట్లాది మంది తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటాడుకుంటారని కేటీఆర్ మండిపడ్డారు. టూరిస్ట్ పార్టీలను నమ్మితే జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో రెండేళ్లలోనే తెలిసి వచ్చిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.