Andhra Pradesh : హ్యాపీ డేస్.. విద్యార్థులకు ఫుల్లు హాలిడేస్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాసంస్థలకు తొమ్మిదిరోజులు దసరా సెలవులు ప్రకటించింది. తెలంగాణలో పదమూడు రోజులు సెలవులు ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాసంస్థలకు తొమ్మిదిరోజులు సెలవులు ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ దసరా సెలవులను డిక్టేర్ చేసింది. తెలంగాణలో దసరా పెద్ద పండగ. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతిని పెద్ద పండగగా జరుపుకుంటారు. ఈ రెండు పండగలకు ఎక్కువ సెలవులు వస్తుండటంతో లాంగ్ ట్రిప్ కు అనేక మంది ప్లాన్ చేసుకుంటుంటారు. తాజాగా ఏపీ విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలు అన్నింటికీ తొమ్మిది రోజులు దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకూ దసరా సెలవులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం తొమ్మిదిరోజులు పాటు సెలవులు ప్రకటించింది.
తెలంగాణలో దసరా సెలవులు...
తెలంగాణలో దసరా అతిపెద్ద పండగ. పిల్లా, పెద్దా అందరూ తమ సొంత ఊళ్లకు వెళ్లి దసరా పండగ జరుపుకుంటారు. బతుకమ్మలను పేర్చి తమ సొంత గ్రామాల్లో కలుపుతారు. అందుకే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ సెలవులు దసరాకు ఇస్తారు. సంక్రాంతికి కొంత దీనికంటే తక్కువ ఇస్తారు. తెలంగాణలో దసరా పండగ నాడు అన్ని విద్యాసంస్థలకు పదమూడు రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారికంగా సెలవులను ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ దసరా సెలవులు ఇచ్చారు. తిరిగి నాలుగో తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి.