India Vs New Zealand Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి ఎవరిది? అంచనాలిలా
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఈ ఆదివారం న్యూజిలాండ్ తో ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఈ ఆదివారం న్యూజిలాండ్ తో ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ తో న్యూజిలాండ్ గెలుపొందడంతో ఫైనల్ లో అదే జట్టుతో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్ జట్టు మంచి ఫామ్ లో ఉంది. లీగ్ మ్యాచ్ లో భారత్ పై ఓటమి సాధించినప్పటికీ అది మరింత కసిగా ఫైనల్స్ లో తలపడే అవకాశముంది. న్యూజిలాండ్ జట్టు సమిష్టిగా రాణిస్తుందని క్రీడానిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.
బలమైన న్యూజిలాండ్...
భారత్ కు ఏమాత్రం తగ్గకుండా న్యూజిలాండ్ జట్టు ఉండటంతో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో లో పోరు మామూలుగా ఉండదు. రెండు మేటి జట్ల మధ్య పోరు జరగనుంది. లీగ్ మ్యాచ్ లో భారత్ పై ఓటమి పాలయినప్పటికీ మన బౌలర్లకు వారు అలవాటుపడినట్లు అంచనాలున్నాయి. దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో ఓడినా అది భారత్ తో తప్పించి అన్ని మ్యాచ్ లలో గెలిచి మంచి ఊపుమీదుంది. పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ దాని సొంతం. బౌలింగ్ పరంగా కూడా మరింత శక్తిమంతంగా ఉంది.
భారత్ కూడా...
ఇక భారత్ విషయానికి వస్తే మన ప్లేయర్లు కూడా సమిష్టిగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లి ఫుల్లు ఫామ్ లోకి రావడం శుభపరిణామ. అదే సమయంలో శుభమన్ గిల్, రోహిత్ శర్మ కాస్త కుదురుగా ఆడితే మనకు తిరుగుండదు. ఫైనల్ పోరులో బౌలింగ్ కూర్పులో భారత్ కొన్ని మార్పులు చేరే అవకాశముందని చెబుతున్నారు. అలాగే బ్యాటింగ్ లోనూ కేఎల్ రాహుల్ తిరిగి పుంజుకోవడంతో భారత్ కు విజయావకాశాలు మెరుగయ్యాయంటున్నారు. అదే సమయంలో ఓపెనర్లు రాణించడంతో పాటు బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయగలిగితే మనదే ట్రోఫీ అవుతుంది. అయితే భారత్ కు ఒకే ఒక వీక్ నెస్. అది ఫైనల్ ఫియర్ అన్నది అందరికీ తెలిసిందే. మరి ఏం జరుగుతుందో చూడాలి.