India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా హోరాహోరీ పోరు
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే రాంచీ వేదికగా జరగనుంది.
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే రాంచీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్లు సమ ఉజ్జీలు కావడంతో గెలుపోటములను అంచనా వేయాలేని పరిస్థితి. అయితే ఇప్పటికే టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురైన భారత్ సొంత గడ్డపై వన్డే సిరీస్ ను అయినా గెలవాలన్న కసితో రగిలిపోతుంది. అయితే అంత సులువు కాదు. దక్షిణాఫ్రికాకు భారత్ పై ఆడిన వన్డే మ్యాచ్ లలో ఆధిక్యత ఉండటమే ఇందుకు కారణం. టెస్ట్ సిరీస్ గెలిచిన ఉత్సాహంతో దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది.
బ్యాటింగ్ పరంగా...
అయితే వన్డే మ్యాచ్ లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉండటం కొంత జట్టుకు ధైర్యాన్నిఇచ్చే అంశంగానే చెప్పాలి. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ రాత్రి వరకూ సాగనుంది. యాభై ఓవర్లున్న ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరి వైపు అయినా తిరిగే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి. కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తుండటంతో పాటు బ్యాటింగ్ పరంగా భారత్ జట్టు బలంగానే కనిపిస్తుంది. అదే సమయంలో బౌలింగ్ లో కొంత లహీనంగా ఉందనిపిస్తుంది. జస్స్రిత్ బుమ్రా, సిరాజ్ లకు విశ్రాంతి ఇవ్వడంతో యువ పేసర్లు ఏ మేరకు వికెట్లను వెంట వెంటనే తీయడంలో సక్సెస్ అవుతారన్నది చూడాలి.
బౌలర్లపై వత్తిడి లేకుండా...
మరొకవైపు స్పిన్నర్లపై కూడా వత్తిడి అధికంగానే ఉంటుంది. వాషింగ్టన్ సుందర్, జడేజాలు ఇద్దరు ఆల్ రౌండర్లు కావడంతో వారు ఏ మేరకు వికెట్లు తీయగలరన్నద కూడా అనుమానమే. హర్షిత్ రాణా, అర్షదీప్, ప్రసిద్ధ్ కృష్ణలు సీమర్లుగా ఏ మేరకు వికెట్లు తీయడంలో విజయం సాధిస్తారోవేచి చూడాలి. బ్యాటర్లు కూడా తొలుత బ్యాటింగ్ చేస్తే ఎక్కువ పరుగులు చేస్తేనే దక్షిణాఫ్రికా వత్తిడి పెంచవచ్చు. లేకపో్తే ఆ ఒత్తిడి భారత్ బౌలర్ల పై పడుతుండనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఫీల్డింగ్ పరంగా కూడా కట్టుదిట్టంగా ఉండాల్సి ఉంది. మొత్తం మీద ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీ గా సాగనుంది.