టెస్టుల్లో ఆడడంపై విరాట్ కోహ్లీ క్లారిటీ
విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. తాను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. తాను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తాడంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించాడు కోహ్లీ. ప్రాక్టీస్ లేదా సన్నద్ధతను నమ్మనని, తన క్రికెట్ అంతా మానసికమైనదేనన్నాడు కోహ్లీ. మానసికంగా ఉత్సాహంగా ఉన్నంత కాలం రాణించగలనని చెప్పాడు.
ఫిట్‌నెస్ స్థాయులు, మానసిక ఉత్సాహం ఉన్నప్పుడు మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లేనని స్పష్టం చేశాడు. 300కి పైగా వన్డేలు ఆడిన అనుభవం తనకు ఉందని, ఫామ్‌లో ఉన్నంత కాలం నెట్స్‌లో గంటన్నర సాధన చేస్తే సరిపోతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు వయసు 37 ఏళ్లు. కాబట్టి ఆట తర్వాత రికవరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు.