Team India : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ టీం ఇండియా స్క్కాడ్ ఇదే
భారత్ లో దక్షిణాఫ్రికాతో తలపడే టీ20 సిరీస్ కు జట్టును బీసీసీఐ ప్రకటించింది.
భారత్ లో దక్షిణాఫ్రికాతో తలపడే టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ లను టీ20 జట్టుగా బీసీసీఐ ఎంపిక చేసింది.
ఈ నెల 9న తొలి మ్యాచ్...
ఈ నెల 9వ తేదీ నుంచి టీ20 సిరీస్ భారత్ దక్షిణాఫ్రికాతో ఆడబోతుంది. 9వ తేదీన కటక్ లో మొదటి టీ20, న్యూ చత్తీస్ గఢ్ లో పదకొండో తేదీన రెండో టీ 20, ధర్మశాలలో మూడో టీం ఈ నెల 14వ తేదీన, 17వ తేదీన లక్నోలో భారత్ తలపడుతుంది. ఐదో టీ20 19వ తేదీన అహ్మదాబాద్ లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ వ్యవహరించనున్నాడు.