India vs South Africa : భయపెట్టారు.. కానీ చివరకు విజయం భారత్ దే
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ టీ20ని తలపించింది
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ టీ20ని తలపించింది. పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. చివరి ఓవర్ వరకూ గెలుపు ఎవరదన్నది కూడా అంచనా వేయడం కష్టంగా మారింది. భారత్ భారీ పరుగులు చేసినా.. దక్షిణాఫ్రికా తొలి రెండు ఓవర్లలోనే కీలకమైన వికెట్లు కోల్పోయినా బెదరలేదు. భయపడలేదు. భారత్ ను ఒకరకంగా భయపెట్టిందనే చెప్పాలి. చివరకు భారత్ దక్షిణాఫ్రికాపై పది హేడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతలో కొనసాగింది. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332కి ఆలౌటైంది. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇద్దరి జోడీతో...
తొలుత యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చారు. అయితే కొంత దూకుడుగా ఆడిన యశస్వి జైశ్వాల్ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి నిలబడటం, మరొకఎండ్ లో రోహిత్ శర్మ పాతుకుపోవడంతో వీరిద్దరి భాగస్వామ్యంతో చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్ ను చూసినట్లయింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి చెలరేగి ఆడాడు. రోహిత్ శర్మ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన 52వ వన్డే శతకం బాదాడు. విరాట్ 120 బంతుల్లో 135 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు. భారత్ 50 ఓవర్లలో 349 పరుగులు చేసి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచినట్లయింది. 350 పరుగులు చేస్తేనే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ గెలుస్తుంది.
11/3 వికెట్లు కోల్పోయినా...
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే వరసగా కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఏ మాత్రం బెదరకుండా మాథ్యూ బ్రీట్స్‌కీ 72 పరుగులు, మార్కో జాన్సన్ 70 పరుగులు, కార్బిన్ బోష్ నిలబెట్టే ప్రయత్నం చేశా రు. కానీ భారత్ బౌలర్లు చివరలో ఒత్తిడి పెంచడంతో వారు విఫలమయ్యారు. ఇంతకుముందు, కోహ్లీ–రోహిత్‌లు భారత్ ఇన్నింగ్స్‌కు బలం ఇచ్చారు. రోహిత్ శర్మ 51 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ వన్డేల్లో 352వ సిక్సర్ కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. . అనంతరం కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టును 300 దాటేలా నడిపించాడు. కుల్దీప్ యాదవ్ నాలుగు, హర్షిత్ రాణా మూడు వికెట్లను కీలక సమయంలో తీసి భారత్ విజయానికి కారణమయ్యారు.