Virat Kohli : బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. నువ్వు మామూలోడివి కాదు సామీ

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య రాయపూర్ లో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లి బ్యాక్ టు బ్యాక్ సెంచరీ సాధించాడు

Update: 2025-12-03 11:55 GMT

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య రాయపూర్ లో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లి బ్యాక్ టు బ్యాక్ సెంచరీ సాధించాడు. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఎప్పటి లాగే ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించారు. అయితే రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. యశస్వి జైశ్వాల్ కూడా 22 పరుగులకే వెనుదిరిగాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్ లు కలసి ఇన్నింగ్స్ ను నిర్మించారు.

రెండు సెంచరీలు...
భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కొహ్లీలు చెరొక సెంచరీ సాధించారు. దీంతో మరోసారి భారత్ భారీ పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. 358 పరుగులు టీం ఇండియా చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇందులో పన్నెండు ఫోర్లు, రెండు సిక్స్ లు ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లి 93 బంతుల్లో 102 పరుగులు చేశడు. కోహ్లి ఏడు ఫోర్లు రెండు సిక్స్ లు కొట్టాడు. రాంచీ, రాయపూర్ లో వరసగా విరాట్ కోహ్లి సెంచరీ సాధించడం తో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.
కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ...
విరాట్ కోహ్లి మరోసారి తన విశ్వరూపం చూపించాడు. భారత్ కు అవసరమైనప్పుడల్లా విరాట్ చెలరేగి ఆడుతుండటం టీం ఇండియాకు కలసి వచ్చినట్లే కనిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ కు వన్డేల్లో ఇది తొలి సెంచరీ అయింది. కేఎల్ రాహుల్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా రాహుల్ కు తన సహకారాన్ని అందిస్తున్నాడు. దీంతో రాంచీ తరహాలోనే భారత్ భారీ స్కోరును దక్షిణాఫ్రికా ఎదుట ఉంచినట్లయింది. దక్షిణాఫ్రికా గెలవాలంటే 359 పరుగులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ విధంగా ఛేజింగ్ లో అడ్డుకుంటారన్నది చూడాలి.



Tags:    

Similar News