India vs South Africa : రోకోలు మళ్లీ జోరు చూపిస్తారా? ఫ్యాన్స్ వెయిటింగ్

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే రేపు రాంచీలో జరగనుంది.

Update: 2025-11-29 02:19 GMT

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే రేపు రాంచీలో జరగనుంది. వన్డే సిరీస్ లోనైనా తమ సత్తా చూపించాలని భారత్ భావిస్తుంది. గట్టిగా శ్రమిస్తుంది. ఇందుకోసం జట్టులో కొన్ని మార్పులతో రేపటి మ్యాచ్ లో మైదానంలో దిగే అవకాశాలున్నాయి. టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తుంది. మొత్తం మూడు వన్డే మ్యాచ్ లు జరుగుతుండటంతో విజయం సాధించాలని ఇరు జట్లు రాంచీలో ఇప్పటికే ప్రాక్టీస్ ను ప్రారంభించాయి. విజయం కోసం శ్రమిస్తున్నాయి.

గాయాల కారణంగా...
అయితే తొలి వన్డే మ్యాచ్ నుంచి సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు జట్టులోకి రానున్నారు. రాంచీలో రోకోల ద్వయం ఏ మేరకు క్లిక్ అవుతుందో చూడాలి. త్వరలో జరగనున్న వరల్ కప్ ఛాంపియన్ షిప్ పోటీలకు వీరిద్దరూ ఆడతారా? లేదా? అన్నది పక్కన పెడితే ఇప్పుడు వీరు చూపించే ఆటతీరు మాత్రమే వారిని కొనసాగించే వీలుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్ కు శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం రోకోలను మైదానం లో చూడటం కోసం వేచి చూస్తున్నారు.
కీలకమైన వారు దూరం కావడంతో...
ఈ వన్డే మ్యాచ్ లకు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలు దూరమయ్యారు. హార్ధిక్ పాండ్యా కూడా లేడు. దీంతో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. ప్రసిద్ధ్ కృష్ణతో పాటు అర్ష్ దీప్ సింగ్ కూడా ఆడనున్నారు. ఆల్ రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ కు కూడా అవకాశం లభించింది. యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగనున్నారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లి రానున్నాడు. రిషబ్ పంత్ ను పక్కన పెట్టాలని భావిస్తే మాత్రం తిలక్ వర్మకు అవకాశముంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. మరి టీం ఇండియా ఎలా ఆడుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News