విజయ్ హజారే టోర్నమెంట్ లో విరాట్
విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడు.
విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధృవీకరించారు. విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి జనవరి 18 వరకు జరగనుంది. విరాట్ కోహ్లీ దశాబ్దానికి పైగా విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. చివరిసారిగా 2008-2010 మధ్య కాలంలో అతను ఈ టోర్నీలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలో 13 మ్యాచ్‌లలో 68.25 సగటుతో 4 సెంచరీలు, 3 అర్ధసెంచరీలతో కలిపి 819 పరుగులు సాధించాడు.