India Vs South Africa : భారత్ అభిమానులూ బేఫికర్... వచ్చేస్తున్నాడోచ్
ఆల్ రౌండర్ లో జట్టులోకి వస్తున్నాడు. ఇన్నాళ్లూ టీం ఇండియాలో హార్ధిక్ పాండ్యా లేని లోటు కనిపిస్తుంది
భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందినట్లే. ఆల్ రౌండర్ లో జట్టులోకి వస్తున్నాడు. ఇన్నాళ్లూ టీం ఇండియాలో హార్ధిక్ పాండ్యా లేని లోటు కనిపిస్తుంది. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ లో తనదైన కసిని చూపించే పాండ్యా వచ్చేస్తున్నాడు. గాయం కారణంగా హార్ధిక్ పాండ్యా క్రికెట్ కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనతో పాటు దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కు కూడా హార్థిక్ దూరం కావడం అభిమానుల్లో ఆందోళన కనిపించింది. అయితే హార్థిక్ పాండ్యా పూర్తిగా కోలుకున్నారని, త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కు వచ్చేస్తున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
గాయం తర్వాత కోలుకుని...
గాయం తర్వాత హార్థిక్ పాండ్యా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత బీసీసఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. ఈ ఏడాది సెప్టంబరు నెలలో జరిగిన ఆసియా కప్ లో తొడ కండరానికి గాయం కావడంతో హార్థిక్ పాండ్యా దూరమయ్యాడు. వన్డే సిరీస్ కు హార్థిక్ పాండ్యా రావాల్సి ఉన్నా అప్పటికీ అన్ని టెస్ట్ లు పూర్తి కాకపోవడంతో పక్కన పెట్టేశారు. ఇప్పుడు హార్థిక్ పాండ్యా ఫుల్లు ఫిట్ నెస్ తో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో దక్షిణాఫ్రికాలో జరిగే టీ 20 సిరీస్ లో హార్ధిక్ పాండ్యా పాల్గొంటాడు.
అయితే దేశవాళీ క్రికెట్ లో ఆడిన తర్వాత...
ఇది జట్టుకు కలిసి వచ్చే అంశం. మైదానంలో హార్ధిక్ పాండ్యా ఉంటే ఆల్ రౌండర్ గా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో తనదైన ప్రతిభను చూపి జట్టును విజయతీరాలకు చేరుస్తాడన్న నమ్మకం భారత క్రికెట్ అభిమానుల్లో ఉంది. హార్థిక్ పాండ్యా రాకతో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా జట్టు మరింత బలపడుతుంది. అయితే అంతకు ముందు సయ్యద్ ముష్టాక్ అలి ట్రోఫీలో హార్ధిక్ పాండ్యా ఆడనున్నారు. బరోడా తరుపున ఆడి తన ఫిట్ నెస్ ను నిరూపించుకుని సౌతాఫ్రికాతో జరిగే టీ 20లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో.. క్రికిట్ ఫ్యాన్స్ బేఫికర్.. వచ్చేస్తున్నాడు.