Chapions Trophy : నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగనుంది.
భారత్ - న్యూజిలాండ్ మధ్య నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో రెండు జట్లు తమ సత్తాను చూపించి ఫైనల్స్ కు చేరుకున్నాయి. భారత్ ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు చేరింది.
ఇరు జట్లు..
న్యూజిలాండ్ మాత్రం లీగ్ మ్యాచ్ లో ఓడిపోయినా అన్ని జట్లను ఓడించి ఫైనల్స్ కు చేరుకుంది. ఇరుజట్లలో మేటి బ్యాటర్లున్నారు. అలాగే ఈ పిచ్ స్పినర్లకు అనుకూలించడంతో రెండు జట్లు స్పిన్నర్లను రంగంలోకి దించుతున్నారు. పిచ్ రిపోర్ట్ ప్రకారం టాస్ గెలిచిన వారు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంటారని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీలో విజేత ఎవరన్నది తేలనుంది.