వైరల్‌ ఫొటో: బాహుబలి పవార్‌కు.. కట్టప్ప పవార్‌ వెన్నుపోటు

అజిత్ పవార్.. ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపాడు. ఆయన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో

Update: 2023-07-06 11:36 GMT

అజిత్ పవార్.. ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపాడు. ఆయన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర మలుపు తిరిగాయి. ఆ తర్వాత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అనుభవజ్ఞుడైన శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీని చీల్చాడు. దీంతో పవార్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అజిత్ పవార్‌తో పాటు ఆయన వెంట నడిచిన 29 మంది ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ, తిరుగుబాటు గ్రూపుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసింది.

అయితే అజిత్ ప‌వార్ వ‌ర్గానికి అన‌ర్హ‌త వేటు ప‌డ‌వ‌ద్దు అనుకుంటే.. క‌నీసం 36 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంటుంద‌ని మ‌హారాష్ట్ర శాస‌న‌స‌భ మాజీ కార్య‌ద‌ర్శి అనంత్ క‌ల్సే తెలిపారు. కాగా తమపై ఎటువంటి అన‌ర్హ‌త వేటు ప‌డ‌ద‌ని, లీగ‌ల్ అభిప్రాయాలు తీసుకున్నాకే తిరుగుబాటు ప్ర‌క‌టించిన‌ట్లు అజిత్ ప‌వార్ వ‌ర్గం పేర్కొన్న‌ది. శరద్ పవార్ అనుకూల వర్గం, అజిత్ పవార్ మధ్య విమర్శ, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ మాటల వాగ్వివాదం మధ్య ఎన్‌సీపీ విద్యార్థి విభాగం అజిత్ పవార్ చేసిన ద్రోహాన్ని బాహుబలి సినిమాలోని కట్టప్ప వెన్నుపోటు పొడిచిన బాహుబలి ఎపిసోడ్‌తో పోస్టర్‌ను ఉంచింది.

ఎన్‌సీపీ యొక్క విద్యార్థి విభాగం అజిత్ పవార్.. పార్టీని మోసగించినందుకు అజిత్‌ పవార్‌ను ద్రోహిగా పేర్కొంది. న్యూఢిల్లీలోని ఎన్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ జనాలను ఆకట్టుకుంటోంది. ఇటీవలి కాలంలో, రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి సినిమాల నుండి చాలా సూచనలు తీసుకుంటున్నాయి. ఈ పోస్టర్ కూడా అదే ధోరణిలో పడింది. ఎన్సీపీ అంతర్గత విషయాలపై అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ చీఫ్ శరద్ పవార్ తన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇది అజిత్ పవార్‌కు మింగుడుపడలేదు.

Tags:    

Similar News