Chandrababu : చంద్రబాబు కళ్లలో ఎప్పుడూ అదే కనిపిస్తుంటుందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అంతే.

Update: 2026-01-29 07:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అంతే. ఎప్పుడు అధికారంలో ఉన్నా మరొకసారి అధికారంలోకి వస్తామని విశ్వాసంతో ఉంటారు. కేవలం చంద్రబాబు మాత్రమే కాదు.. అధికారంలో ఉన్న వారు ఎవరైనా అదే ధీమాను కొనసాగిస్తారు. నిన్న జరిగిన టీడీపీ కార్యదర్శుల వర్క్ షాపులోనూ అదే ధీమాను చంద్రబాబు కనపర్చారు. గెలుస్తామని భావించడంలో తప్పులేదు. కానీ మనం తీసుకునే నిర్ణయాలు.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ఎలా ఉందన్న దానిపై ఫోకస్ పెట్టాలి. కేవలం అధికారులు, నేతల నుంచి సేకరిస్తున్న అభిప్రాయాలు ఎప్పుడూ ఆల్ ఈజ్ వెల్ గానే ఉంటాయి. వారికి అలాగే కనిపిస్తాయి. రాష్ట్రమంతటా తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అభివృద్ధి వేగవంతం చేశామని చెప్పుకుంటున్నా గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది.

అధికారుల ఫీడ్ బ్యాక్ పై...
కానీ చంద్రబాబు 1995 నుంచి ఆ పని ఇప్పటి వరకూ చేయలేదు. కేవలం అధికారుల మీదనే ఆధారపడి పాలన బాగుందని తనకు తాను ఫీలవుతుంటారు. ప్రతిపక్షం అసలు అధికారంలోకి రాకూడదని అనుకోవడంలో తప్పులేదు. అలాగే ఒక ప్రభుత్వానికి ఐదేళ్ల సమయం అభివృద్ధిని చేసేందుకు సరిపోదు. కానీ ప్రజలు అలా ఆలోచించరు. మార్పు కావాలనుకుంటున్నారు. అందులోనూ అభివృద్ధి అనేది కంటికి కనిపించదు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు మాత్రమే బేరీజు వేసుకుని ప్రజలు ప్రభుత్వానికి ఓటు వేయాలా? లేదా? అన్నది నిర్ణయించుకుంటారు. సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇస్తున్నామని అనుకోవచ్చు. కానీ ప్రజల్లో అటువంటి భావన లేదు.
ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తూ...
ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన పథకాలు అందడం లేదని వారు నిలదీస్తున్నారు. ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిని ఒక మహిళ తమకు సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదని అడగడం గమనించాల్సిన విషయం. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా.. అంటే గత ప్రభుత్వంలోనూ ఇచ్చారు కదా? అని ఎదురు ప్రశ్నించింది. అలా ఉంటుంది. ప్రజల నాటి. వాటిని తెలుసుకోకుండా తమకు పదేళ్లు.. పదిహేనేళ్లు అధికారం కావాలని అనుకుంటే మాత్రం అది తప్పులో కాలేసినట్లే. అది చంద్రబాబు అయినా జగన్ అయినా సరే. ఎన్నికల్లో ఓట్లేసి ప్రజలు. అసలైన ఫీడ్ బ్యాక్ రావాలంటే జనంలోకి వెళ్లి వారిని అడిగి తెలుసుకోవాలి తప్పించి.. అధికారులు, నేతలపై ఆధారపడితే.. మరోసారి గల్లంతు కాక తప్పదు.


Tags:    

Similar News