Pawan Kalyan : పవన్ ... షాలు చర్చంతా వాటిపైనే అటగా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు

Update: 2026-01-29 07:54 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సారి ఆయన హస్తిన పర్యటనలో ప్రత్యేకత ఉంది. చాలా రోజుల తర్వాత ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలసి పిఠాపురం రైల్వే స్టేషన్ వంటి అభివృద్ధి పనులపై చర్చించినప్పటికీ, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు పవన్ కల్యాణ్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినప్పటికీ ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ఒంటరిగానే పవన్ హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

నాదెండ్ల లేకుండానే...
2019 ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత పవన్ కల్యాణ్ అనేక సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పొత్తుల విషయంలోనూ, మరొక సమయంలోనూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేవారు. ఆయన వెంట ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ ఉండేవారు. ఈసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ సమయంలో నాదెండ్ల మనోహర్ లేకపోవడం ఒక రకంగా చర్చించాల్సిన అంశమేనంటున్నారు. అయితే అదే రోజు మంత్రి వర్గ సమావేశం ఉండటంతో నాదెండ్ల మనోహర్ ను తీసుకోకుండా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అక్కడ జనసేన కు చెందిన ఇద్దరు ఎంపీలు ఉండటం వల్లనే ఆయన పర్యటనలోనాదెండ్ల లేరని పార్టీ వర్గాలు అంటున్నాయి.
రాష్ట్ర రాజకీయాలపైనే...
మరొకవైపు పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అయితే రాజకీయ పరమైన అంశాలు ఎక్కువగానే వీరి మధ్య చర్చకు వచ్చినట్లు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రధానంగా కూటమి బలోపేతంపై చర్చించడంతో పాటు నియోజకవర్గాల పెంపుదలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఈసారి పొత్తుల విషయంలో ఎక్కువ స్థానాలు తీసుకునేలా బీజేపీ, జనసేనలు వ్యవహరించనున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్, అమిత్ షాల భేటీ ఏపీ రాజకీయాల్లో మరొకసారి వేడెక్కింది.


Tags:    

Similar News