భారీ ఎన్ కౌంటర్.. మరో ముగ్గురు ఉగ్రవాదులు హతం !

వారంరోజులుగా భద్రతా దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య

Update: 2022-01-07 07:57 GMT

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ క్రమంగా కొనసాగుతోంది. వారంరోజులుగా భద్రతా దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా ఛదూరా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో 3ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు, భద్రతా దళాలు పేర్కొన్నాయి.

గురువారం రాత్రి నుంచి స్థానిక పోలీసులు, బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో.. పోలీసులు, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపగా.. ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్లో సుమారు 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.


Similar News