Bihar : కేంద్ర మంత్రిగా నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇటీవల జరిగిన బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొనసాగుతున్నారు.అయితే ఆయన కేంద్ర రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడిని రాష్ట్రరాజకీయాల్లో యాక్టివ్ చేసేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా...
గవర్నర్ ను కలిసి ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా సమర్పించనున్నారు. బీహార్ సీఎం పీఠంపై బీజేపీ నేత కూర్చోనున్నారు. ఇప్పటికే ఇటు జేడీయూ, అటు బీజేపీ శాసనసభపక్ష సమావేశాలు జరిగాయి. ఇందులో బీహార్ ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి అప్పగించాలని నిర్ణయించారు. రాజ్యసభకు ఎన్నిక అయిన వెంటనే కేంద్రమంత్రి వర్గంలోకి నితీష్ కుమార్ ను తీసుకోనున్నారు.