Rahul Gandhi : శివగిరి మఠంలో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శనివారం వర్కలాలోని శివగిరి మఠాన్ని సందర్శించారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శనివారం వర్కలాలోని శివగిరి మఠాన్ని సందర్శించారు. సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు స్థాపించిన ఈ ఆశ్రమానికి అధ్యక్షుడు స్వామి సచ్చిదానంద సహా నిర్వాహకులు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. తర్వాత ఆయన మఠం పరిసరాల్లో నారాయణ గురుతో సంబంధం ఉన్న పలు ప్రదేశాలను సందర్శించారు. గురు సమాధి వద్ద నివాళి అర్పించారు.
కొల్లంలో పర్యటన ముగించుకుని...
శుక్రవారం కొల్లంలో జరిగిన కార్యక్రమంలో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, శ్రీ నారాయణ గురు సమావేశం జరిగిన శతాబ్దిని గుర్తుచేసుకుంటూ ఆ కార్యక్రమం నిర్వహించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, ఎమ్మెల్యేలు పి.సి. విష్ణునాథ్, చాండీ ఊమ్మెన్ తదితర పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో ఉన్నారు.