డేరా బాబాకు హైకోర్టులో ఊరట లభించింది. 2002లో జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. డేరా బాబాకు పంజాబ్, హర్యానా న్యాయస్థానంలో ఊరట లభించింది. జర్నలిస్ట్ హత్య కేసులో డేరాబాబాను నిర్దోషిగా తేల్చింది. డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పంజాబ్-హర్యానా హైకోర్టులో భారీ ఊరట లభించింది.
హత్య కేసులో...
జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ, 2019లో సీబీఐ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను కొట్టివేసింది. సాక్ష్యాధారాల లేమితో ఈ సంచలన తీర్పు వెలువడింది. 2002లో జర్నలిస్ట్ హత్యకు గురయ్యారు. ఆ కేసులో డేరాబాబాను దోషిగా చూపుతూ ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు నుంచి డేరా బాబాకు ఊరట దక్కినట్లయింది.