Breaking : రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్

రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి

Update: 2026-03-06 11:44 GMT

రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా ఎల్.పి.జి గ్యాస్ కొరత లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. కేవలం గృహ వినియోగానికి మాత్రమే గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ల జారీని నిలిపేయాని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది.

కమర్షియల్ సిలిండర్లను ....
యుద్ధం ప్రభావంతో ఎల్.పి.జి గ్యాస్ కొరత ఏర్పడనుంది. చమురు సంస్థల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగానికి వాడే గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరింది. దీంతో కమర్షియల్ సిలిండర్లను పంపిణీ చేయకూడదని గ్యాస్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో హోటళ్లు, చిరు వ్యాపారులకు కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపేస్తూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.


Tags:    

Similar News