Gas Cylinders : భారీ షాక్.. గ్యాస్ సిలిండర్ పై ధరలు పెంచిన చమురు సంస్థలు

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి

Update: 2026-03-07 01:34 GMT

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ పై అరవై రూపాయలు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఒకటో తేదీన పెట్రోలియం ఉత్పత్తుల ధరలను, గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు సంస్థలు సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి.

యుద్ధం కారణంగా...
కానీ ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావంతో ధరలు అర్ధరాత్రి నుంచి పెంచినట్లు చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. దీంతో గృహానికి వినియోగించే ఎల్పీజీ సిలెండర్ ప్రస్తుతం హైదరాబాద్ లో 965 రూపాయలకు చేరుకుంది. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు.


Tags:    

Similar News