Fri Dec 05 2025 14:13:49 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. నాలుగేళ్ల కొడుకుపై తండ్రి లైంగిక వేధింపులు !
వీణారెడ్డికి భరత్ రెడ్డితో 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరిద్దరికీ నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. కొంతకాలం క్రితం మనస్పర్ధల

అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకూ వావి, వరసలు లేని అఘాయిత్యాలను చూసుంటారు కానీ.. కన్నకొడుకుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడటం ఎక్కడా జరిగి ఉండదు. ఈ దారుణం హైదరాబాద్ లోని ఉప్పల్ లో వెలుగుచూసింది. తండ్రే కన్నకొడుకుపై లైంగిక దాడికి పాల్పడటంతో.. తల్లి వీణారెడ్డి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
Also Read : నేడు అమెజాన్ ప్రైమ్ లో "పుష్ప" పార్ట్ 1 రిలీజ్ !
వీణారెడ్డికి భరత్ రెడ్డితో 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరిద్దరికీ నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. కొంతకాలం క్రితం మనస్పర్ధల కారణంగా భరత్ - వీణా విడాకులు తీసుకున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు బాబును కొద్దిరోజులు భరత్ రెడ్డివద్దే ఉంచింది వీణారెడ్డి. ఆ సమయంలో పిల్లాడిని భరత్ రెడ్డి చిత్రహింసలు పెట్టాడు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు డాక్టర్ రిపోర్టును కూడా పోలీసులకు అందజేసింది వీణారెడ్డి. తనకు, తన కుమారుడికి రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని వీణారెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేసింది.
Next Story

