నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యుమానిటీ
సినీనటుడు సోనూ సూద్ సాయం చేయడంలో అందరికంటే ముందుంటారు.
సినీనటుడు సోనూ సూద్ సాయం చేయడంలో అందరికంటే ముందుంటారు. తన సంపాదనలో కొంత సమస్యల్లో ఉన్నవారికి ఖర్చు పెట్టడం సోనూ సూద్ కు అలవాటు. గతంలో కరోనా సమయంలోనూ సోనూ సూద్ చేసిన సాయాన్ని ఎవరూ మర్చిపోలేరు. అనేక సమస్యలు, విపత్తుల సమయంలోనూ సోనూ సూద్ వెంటనే స్పందించి వెంటనే బాధితులకు అండగా నిలుస్తారు. అందుకు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించడంలో సోనూ సూద్ తన ఉదారత్వాన్ని చాటుకున్నారు.
దుబాయ్ లలో చిక్కు కున్న వారికి...
దుబాయ్‌లో ఉన్నవారికి సోనూసూద్ సాయం చేస్తానని చెప్పారు. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్నవారికోసం సోనూ సూద్ ముందడుగు వేశారు.ఏ దేశస్థులైనా ఫర్వాలేదంటున్న సోనూసూద్, వారి వారి దేశాలకు చేరుకునేవరకు.. దుబాయ్‌లో వసతి కల్పిస్తానన్న నటుడు ఉచితంగా వసతిని కల్పిస్తానంటూ ప్రకటించారు. సాయం కావాల్సిన వాళ్లు ఇన్‌స్టా ద్వారా సంప్రదించాలని సోనూ సూద్ కోరారు. తన టీమ్ వారికి సాయం చేస్తుందన్న సోనూ సూద్ నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యుమానిటీ అంటూ ప్రకటించారు. ఇన్‌స్టా వేదికగా సోనూసూద్ ప్రకటించారు. సాయం కావాల్సిన వారు సోనూ సూద్ టీం ను సంప్రదించవచ్చు.