భారీగా పెరిగిన మరణాలు

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది.

Update: 2022-08-18 05:39 GMT

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది. ఒక్కరోజులోనే 12,608 మంది దేశ వ్యాప్తంగా కరోెనా బారిన పడ్డారు. 72 మంది కరోనాతో మరణించారు. మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులో 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు శాతం 98.58 శాతానికి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు.

కోవిడ్ నిబంధనలను...
ియాక్టివ్ కేసుల శాతం 0.23 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకూ 4,42,98,864 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 4,36,70,315 కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 5,27,206 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో 1,01,343 యాక్టివ్ కేసులున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, లేకుంటే కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News