నేడు అజిత్ పవార్ భౌతిక కాయానికి అంత్యక్రియలు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి

Update: 2026-01-29 02:41 GMT

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం పదకొండు గంటలకు బారామతిలోని విద్య ప్రతిష్టాన్ ప్రాంగణంలో అజిత్ పవార్ అంత్యక్రియలు జరుగుతాయి. అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అజిత్ పవార్ అంత్యక్రియలను నిర్వహిస్తుంది. అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్, ఫడ్నవిస్, ఏక్ నాధ్ షిండే లు హాజరు కానున్నారు.

మూడు రోజుల పాటు...
అజిత్ పవార్ మృతికి మూడు రోజులు సంతాప దినాలను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీగా ఆయన అభిమానులు బారామతికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో నిన్నటి నుంచే అజిత్ పవర్ ను చివరి చూపు చూసేందుకు బారులు తీరారు. బారామతి సొంత నియోజకవర్గం కావడంతో అక్కడే అంత్యక్రియలను నిర్వహించాలని అజిత్ పవార్ కుటుంబం నిర్ణయించింది.


Tags:    

Similar News